• Tuesday 8 August 2017

    మహేశ్ బాబు స్పైడర్ టీజర్ భయపెట్టడం మాకూ తెలుసు

    స్పైడర్ టీజర్: భయపెట్టడం మాకూ తెలుసు..

    స్పైడర్ టీజర్: భయపెట్టడం మాకూ తెలుసు..



    మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ 
    టీజర్ ప్రకటించిన సమయం కంటే కాస్త ముందే వచ్చేసింది.               ఇంటర్నెట్‌లో ఈ టీజర్ చక్కర్లు కొడుతోంది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ నెట్‌లో ఉదయం ఏడు గంటలకే ఈ టీజర్ హల్‌చల్ చేసింది. మొత్తానికి మహేశ్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ చూసి పండగ చేసుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్ ఆన్ ది వే అంటూ మురుగదాస్ చెప్పిన మాట నిజం కాబోతోందంటూ టీజర్ చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళ టీజర్ కూడా నెట్‌లో హల్‌‌చల్ చేస్తోంది. దసరా కానుకగా స్పైడర్ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు



    No comments:

    Post a Comment

    Fashion

    Beauty

    Travel