• Thursday 20 July 2017

    పవర్ స్టార్ పాత్రలో ఎన్టీఆర్!?


    రాజకుమారుడిగానే కాదు.. రాజుగా.. చక్రవర్తిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకుమారుడిగా కనిపించనున్నాడన్నదే దీని సారాంశం.

    అయితే.. ఇదేమీ నిజమైన రాజుల కథ కాదు. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన 'రాజకుమార' అనే మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రతిపాదన రాగా.. ఈ కథకు యంగ్ టైగర్ అయితేనే సరిగ్గా సరిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన జూనియర్.. రాజకుమారపై ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం.. అక్కడ మంచి విజయం సాధించడమే కాదు.. రీసెంట్ గా హండ్రెడ్ డేస్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ శాండల్ వుడ్ మూవీ స్టోరీ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చేసిందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే.. ఎవరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు.. ఎవరు రీమేక్ చేయనున్నారనే అంశాలపై మాత్రం క్లారిటీ లేదు. 

    No comments:

    Post a Comment

    Fashion

    Beauty

    Travel